భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ. 400 లు, కిలో వెండి పై రూ.4,700 లు తగ్గింది.

Update: 2022-03-15 01:19 GMT

బంగారం ధర పెరగడం ప్రారంభించిందంటే ఇక ఆగదు. ఇది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట. బంగారానికి ఎప్పటికీ డిమాండ్ తగ్గకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణంగా చూపుతున్నారు. కారణం ఏదైనా బంగారం ధర పెరగడం మాత్రం ఖాయం అన్నది అందరికీ తెలిసిందే. అయితే ధరలు పెరిగినంత మాత్రాన బంగారం కొనుగోళ్లు తగ్గుతాయనుకుంటే భ్రమే. ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. అందుకే బంగారానికి అంత డిమాండ్ ఉందన్నది అర్థమవుతుంది. అప్పుడప్పుడూ స్వల్పంగా బంగారం ధర తగ్గి అందరినీ మురిపిస్తుంది.

వెండి కూడా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ. 400 లు, కిలో వెండి పై రూ.4,700 లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,470 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,200 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News