గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.150లు, కిలో వెండి పై వెయ్యి రూపాయలు తగ్గింది.

Update: 2022-03-20 01:13 GMT

బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో? పెరుగుతాయో చెప్పలేం. ధర తగ్గిదంటే నిజంగా గుడ్ న్యూస్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. బంగారం అంటే భారత్ లో పిచ్చి. దానిని కొనుగోలు చేయనిదే నిద్ర పట్టదు కొందరికి. ముఖ్యంగా మహిళలకు బంగారంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. తమ దగ్గర బంగారం ఇంత ఉంది అని చెప్పుకోవడానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. ఇక ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్నాయి.

వెండి కూడా.....
అయితే తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.150లు, కిలో వెండి పై వెయ్యి రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,300 రూపాయలుగా ఉంది. బంగారం కొనుగోళ్లకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News