Bengauluru : బెంగళూరు వెళ్లేవారికి అలెర్ట్.. సగం నగరం మునిగిపోయింది

బెంగళూరు నగరంలో భారీ వర్షాలు భయాందోళనలకు గురి చేస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సగం నగరం నీట మునిగింది

Update: 2024-10-22 12:32 GMT

బెంగళూరు నగరంలో భారీ వర్షాలు భయాందోళనలకు గురి చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సగం నగరం నీట మునిగింది. ఎక్కడ చూసినా నీరే. ప్రతి రోజూ సాయంత్రం కుండపోత వర్షం కురుస్తుండటంతో బెంగళూరు నగరం అతలాకుతలమవుతుంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచపోతుంది. నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జామున వరకూ పడిన వర్షానికి బెంగళూరు నగర వాసులు బెంబేలెత్తి పోయారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు గత కొద్ది రోజులుగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీచేసింది.

నీట మునిగిన దక్షిణ ప్రాంతం...
భారీ వర్షాలకు బెంగళూరులోని దక్షిణ ప్రాంతం మొత్తం నీట మునిగింది. నిన్న ఒక్క రోజే 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని బెంగళూరు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ ప్రాంతంలోని అనేక ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బాధితులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. బెంగళూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు సాఫ్ట్్్్ వేర్ ఉద్యోగులు ఆఫీసులు, ఇళ్లకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందుల పడుతున్నారు.
కూలిన భవనం.. ఒకరు మృతి...
గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని బెంగళూరు వాసులు లబోదిబోమంటు్నారు. సాయంత్రం వేళలో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి కొంత ఉపశమనం కల్గిస్తుంది. అందుకే బెంగళూరు వెళ్లే వారికి అలెర్ట్ ప్రకటించారు. బెంగళూరులోని వెంకటగిరి కోటెలో అత్యధికంగా భారీ వర్షం గొట్టెగెరె, చౌడేశ్వరి నగర్, యహలంక న్యూ టౌన్, ఓల్డ్ టౌన్, భాగలూరు, కట్టెగెనహళ్లి, హెబ్బాళ ప్రాంతంలో వర్షం నమోదయింది. కార్లన్నీ నీట మునిగాయి. భారీ వర్షానికి బెంగళూరులోని ఒక భవనం కూలింది. నిర్మాణంలో ఉన్న భవం కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. పదిహేడు మంది గాయపడ్డారు. శిధిలాల కింద 17 మంది కార్మికులు చిక్కుకున్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News