Narendra Modi Gaganyan:భారతదేశం అంతరిక్షంలోకి పంపిస్తున్న వ్యోమగాములు వీరే!!

ప్రధాని నరేంద్ర మోదీ గగనయాన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను

Update: 2024-02-27 08:18 GMT

Narendra Modi Gaganyan:ప్రధాని నరేంద్ర మోదీ గగనయాన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రపంచానికి తెలియజేసారు. గగన్‌యాన్ మిషన్ వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ నలుగురు భారతీయ వైమానిక దళ అధికారులు.. స్వదేశీ అంతరిక్ష వాహనంపై భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారతీయులుగా చరిత్ర సృష్టించనున్నారు. నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాడర్ శుభాంశు శుక్లా అని ప్రధాని మోదీ తెలిపారు. నలుగురు వ్యోమగాములు రష్యాలో విస్తృతమైన శిక్షణ పొందారు. ఇప్పుడు భారతదేశంలో ఇస్రో శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలుగురు వ్యోమగాములకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇస్రో కీర్తిని చాటే ఆ న‌లుగురి పేర్ల‌ను మోదీ ప్ర‌క‌టించారు. కేర‌ళ‌లోని తిరువనంత‌పురంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గ‌గ‌న్‌యాన్ మాన‌వ యాత్ర‌కు ఎంపికైన వ్యోమ‌గాముల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గ్రూప్ కెప్టెన్ ప్ర‌శాంత్ బాల‌కృష్ణ నాయ‌ర్‌, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణ‌న‌న్‌, గ్రూప్ కెప్టెన్ అంగ‌ద్ ప్ర‌తాప్‌, వింగ్ క‌మాండ‌ర్ శుభాన్షు శుక్ల పేర్ల‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు. ఆ న‌లుగురికీ ఆయ‌న ఆస్ట్రోనాట్ వింగ్స్‌ను అంద‌జేశారు. గగన్‌యాన్ మిషన్ ముగ్గురు వ్యోమగాములతో కూడిన సిబ్బందిని 'లో ఎర్త్ ఆర్బిట్' లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నం ద్వారా అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపే నాల్గవ దేశంగా భారతదేశం అవతరిస్తుంది.


Tags:    

Similar News