Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు.. ఐపీఎల్ తొలిరోజే
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న చిరుజల్లులు పడటంతో కొంత ఉపశమనంగా ఉంది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న చిరుజల్లులు పడటంతో కొంత ఉపశమనంగా ఉంది. కానీ నేడు భారీ వర్షం కురిసింది. తూత్తుకుడి జిల్లా సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు భారీ వర్షంతో ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై కూడా నీళ్లు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
ఐదు రోజుల పాటు...
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రాయలసీమ, కేరళలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లోనూ వచ్చే రెండు రోజుల్లోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. అయితే ఈరోజు ఆరంభ మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుండటంతో వర్షం ముప్పు ఏ మేరకు ఉంటుందన్న ఆందోళన అటు నిర్వాహకుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ నెలకొని ఉంది.