Gas Cylinder Rate:దేశ ప్రజలకు మహిళా దినోత్సవ కానుక.. సిలిండర్ పై 100 తగ్గింపు

మహిళా దినోత్సవం రోజున మహిళలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం

Update: 2024-03-08 04:00 GMT

Gas Cylinder Rate:మహిళా దినోత్సవం రోజున మహిళలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని.. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.

"ఈ రోజు, మహిళా దినోత్సవం సందర్భంగా, మా ప్రభుత్వం LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గించాలని నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది," అని ఆయన ట్వీట్ చేశారు. వంటగ్యాస్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తమ ప్రభుత్వం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం నిర్ణయం మహిళలకు సాధికారత చేకూరుస్తుందని అన్నారు. "వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, మేము కుటుంబాలకు మద్దతు ఇస్తున్నాం. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చేయడాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మహిళలకు సాధికారత కల్పించడానికి, వారికి 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని నిర్ధారించడానికి మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది," అని తెలిపారు.

ఇక కేబినెట్ లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీని దాని లబ్ధిదారులకు మార్చి 2025 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.


Tags:    

Similar News