Modi : తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
తమిళనాడును ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
తమిళనాడును ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం వంటి ఆలయాలను సందర్శిచుకునేందుకు సులువైన రవాణా మార్గాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తమిళనాడులో పర్యటించారు. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ ను ప్రారంభించారు. ఇందుకోసం 1,112 కోట్ల రూపాయలను వ్యయం చేశారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం...
ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో ఏటా 4.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. ఎయిర్, రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సాగర్‌మాల ప్రాజెక్టు కింద తమిళనాడుకు మరిన్ని నిధులను కేటాయించామని తెలిపారు.