Narendra Modi : నేడు శ్రీలంకలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ నేడు శ్రీలంకలో పర్యటిస్తున్నారు.;

ప్రధాని నరేంద్రమోదీ నేడు శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఆయన శ్రీలంకకు చేరుకున్న తర్వాత భారీగా స్వాగతం పలికారు. శ్రీలంక సైనికుల గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. ఈరోజు శ్రీలంక ప్రధానితో మోదీ సమావేశమవుతున్నారు. నూతన ప్రధాని ఎంపికయిన తర్వాత తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తున్న ప్రధాని వివిధ అంశాలపై చర్చించనున్నారు.
రెండుదేశాల మధ్య...
రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మధ్యచర్చిస్తారు. అలాగే వివిధ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై కూడా చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య గతంలో మాదిరిగా మంచి వాతావరణం నెలకొనేలా ఉండేందుకు ఈ చర్చలు దోహదపడతాయని అంటున్నారు. కొలొంబో చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ భారతీయ సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు.