Loksabha : నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
నేటితో పార్లమెంటు మలి విడత సమావేశాలు ముగియనున్నాయి.;

నేటితో పార్లమెంటు మలి విడత సమావేశాలు ముగియనున్నాయి. మొత్తం పద్దెనిమిది రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో అతి కీలకమైన వక్ఫ్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. లోక్ సభలో దాదాపు పది గంటలకు పైగానే వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. రాజ్యసభలోనూ పది గంటలకు పైగానే చర్చ జరిగింది.
కీలకమైన వక్ఫ్ బిల్లును...
వక్ఫ్ బిల్లును ఇండి కూటమి వ్యతిరేకించింది. విపక్షాల నిరసనల మధ్య ఓటింగ్ జరిపి బలాబలాలను పరిశీలించిన అనంతరం వక్ఫ్ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస పక్ష నేత రాహుల్ గాంధీ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. తీవ్రమైన విమర్శలకు దిగారు. అయితే తనకు మాట్లడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదంటూ ఆయన పార్లమెంటు బయట నిరసనకు కూడా దిగారు.