నేడు భారత్ కు తహావుర్ హుస్సేన్ రాణా
ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావుర్ హుస్సేన్ రాణాను నేడు భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకు రానున్నారు;

ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావుర్ హుస్సేన్ రాణాను నేడు భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకు రానున్నారు. అమెరికా నిర్భంధంలో ఉన్న తహావుర్ హుస్సేన్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించడతో ప్రత్యేక విమానంలో తీసుకు వస్తున్నారు. ఈరోజు భారత్ కు చేరుకోనున్నారు. తహావుర్ హుస్సేన్ రాణాకు అప్పగింతకు సంబంధించి న్యాయపరమైన చిక్కులన్నీ తొలిగిపోవడంతో ఇండియాకు తీసుకు వస్తున్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడిగా తహావుర్ హుస్సేన్ రాణా ఉన్నారు.
ముంబయి ఉగ్రదాడి కేసులో...
ఈ ఆపరేషన్ లో కీలకంగా వ్యవహరించాడు. 2008 నవంబరు 26వ తేదీన ముంబయిలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 166 మంది వరకూ మరణించారు. ఈ దాడిలో పది మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. తహావుర్ హుస్సేన్ రాణా అమెరికాకు పోయి అక్కడ పోలీసులకు చిక్కాడు. అయితే అప్పటి నుంచి భారత్ కు వెళ్లకుండా న్యాయపరమైన అన్ని మార్గాలను తహావుర్ హుస్సేన్ రాణా ఉపయోగించుకున్నాడు. చివరకు అన్నీ న్యాయపరమైన చిక్కులు తొలిగిపోవడంతో నేడు తహావుర్ హుస్సేన్ రాణాను భారత్ కు తీసుకు వస్తున్నారు.