భారత ఇంజినీరింగ్ అద్భుతం.. పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని...
భారత తొలి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ ద్వారా ప్రారంభించారు.;

PM Modi Inaugurates India's First Vertical Lift Sea Bridge at Pamban, an Engineering Marvel Connecting Rameswaram
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం చేరుకుని, భారత ఇంజినీరింగ్ ప్రతిభకు జీవన ముద్రగా నిలిచిన పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ నేడు అధికారికంగా ప్రారంభించారు. దేశ మొదటి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిగా గుర్తింపు పొందిన పంబన్ నూతన రైల్వే వంతెనను రిమోట్ ద్వారా ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ అద్భుత వంతెనను ప్రారంభించడం గర్వకారణంగా నిలిచింది. ప్రారంభంతోనే వంతెన పైకి లిఫ్ట్ అవ్వగా, కిందుగా భారత తీర గస్తీ నౌక దూసుకెళ్లింది. ఇది రైల్వే ఇంజనీరింగ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
తమిళనాడులోని ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే పాత పంబన్ బ్రిడ్జికి వందేళ్లు పూర్తవడంతో, తాజాగా అత్యాధునిక సాంకేతికతతో ఈ కొత్త వంతెనను నిర్మించారు. పాత బ్రిడ్జి రెండు భాగాలుగా విభజించి ఓపెన్ అవుతుండగా, ఈ కొత్త వంతెనలో 72.5 మీటర్ల వెడల్పుతో మధ్యలో లిఫ్ట్ సౌకర్యం ఉంది. 17 మీటర్ల ఎత్తుకు పైకి లేచే ఈ లిఫ్ట్ వల్ల పెద్ద నౌకలు కూడా సులభంగా వెళ్లగలుగుతాయి.
వంతెన ప్రత్యేకతలు:
మొత్తం పొడవు: 2.08 కి.మీ
బ్రిడ్జి నిర్మాణ వ్యయం: రూ.535 కోట్లు
స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మాణం
తుప్పు రాకుండా ప్రత్యేక రసాయనంతో కోటింగ్
ఇండియాలో మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి
భారీ నౌకలకు సౌలభ్యం కలిగించేలా డిజైన్
వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ వండర్‌గా గుర్తింపు
ఈ వంతెనను నిర్మించిన ప్రాంతమైన పంబన్, రామాయణ ఇతిహాసంతోను అతి ప్రాచీన సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉంది. రామేశ్వరం ధనుష్కోటినుంచి శ్రీరాముడు వానరసేన సహాయంతో రామసేతు నిర్మించాడని కథనాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్ర భూమిలో ఏర్పడిన ఈ వంతెన భౌతికంగా మాత్రమే కాక, ఆధ్యాత్మిక వారసత్వానికి కూడా చిహ్నంగా నిలుస్తోంది.
ఇది నేటి భారత ఆధునికత, ఇంజనీరింగ్ చాతుర్యం, సాంస్కృతిక విలువల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది.