BJP : నేటి నుంచి బీజేపీ గావ్ చలో - బస్తీ చలో
నేటి నుంచి బీజేపీ దేశ వ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమం చేపట్టనుంది;

నేటి నుంచి బీజేపీ దేశ వ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమం చేపట్టనుంది. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి జరగనున్న మేలుతో పాటు భవిష్యత్ లో జరగనున్న ప్రయోజనాలు వివరించనుంది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ ఈ చర్యలకు దిగింది.
నేటి నుంచి...
దీనికి గావ్ చలో - బస్తీ చలో కార్యక్రమాన్ని చేపట్టింది. వక్ఫ్ బిల్లు సవరణల కారణంగా ముస్లింలకు కలిగే ప్రయోజనాలను వివరించడానికి బీజేపీ నేతలు గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న ప్రతి బస్తీల్లో పర్యటించి వారికి అవగాహన కల్పించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో ప్రయోజనాలే తప్ప నష్టాలేమీ లేవని ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని కమలనాధులు చేపట్టారు.