తడిసిముద్దవుతున్న ముంబయి

ముంబయి నగరాన్ని వర్షాలు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2022-07-07 05:18 GMT

ముంబయి నగరాన్ని వర్షాలు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. రహదారులన్నీ వాననీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు విధులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల రహదారులపై నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

నేడు కూడా..
ముంబయి నగరపాలక సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు వీలయినంత వరకూ బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఈరోజు కూడా ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, హోర్డింగ్ ల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముంబయి తడిసి ముద్దవుతుండటంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News