Kerala Landslide : శిధిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడిన నలుగురు... మృత్యుంజయులే కదా?

కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Update: 2024-08-02 07:36 GMT

కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి సహాయక చర్యలు ప్రారంభించినా రెండు రోజుల నుంచే అవి ఊపందుకున్నాయి. మొదటి రెండు రోజుల పాటు వర్షం కురుస్తుండటం, ఘటన స్థలికి వెళ్లే వంతెన కూలి పోవడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. అయినా ఆర్మీ, ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిధిలాల కింద ఉన్న వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

జాగ్రత్తగా తొలగిస్తూ...
అయితే తాజాగా శిధిలాల కింద నుంచి నలుగురిని ఆర్మీ ప్రాణాలతో రక్షించారు. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్య సౌకర్యం కల్పించేందుకు యుద్ధప్రాతిపదికపైన చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల నుంచి శిధిలాల కింద ఉన్న వారిని రక్షించగలిగామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి నీళ్లు, ఆహారం లేకుండా చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న వారు నిజంగా మృత్యుంజయులేనని చెప్పాలి. ఇంకా అనేక మంది ప్రాణాలతో ఉంటారని శిధిలాలను జాగ్రత్తగా ఆర్మీసిబ్బంది తొలగిస్తున్నారు.


Tags:    

Similar News