తమిళనాడులో నేటి నుంచి కఠిన ఆంక్షలు
తమిళనాడు లో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు.
తమిళనాడు లో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. తమిళనాడులో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగాయి. ఒమిక్రాన్ కేసులు ప్రస్తుతం తమిళనాడులో 120కి పెరిగాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇక కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
యాభై శాతం ఆక్యుపెన్సీతో....
నేటి నుంచి తమిళనాడులో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో మాల్స్, సినిమా థియేటర్లు, బస్సులు ఉండేలా చూడాలని ఆదేశించనున్నారు. ఇక ప్రతిచోటా విధిగా శానిటైజర్, ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహించిన తర్వాతనే లోపలికి అనుమతించేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నతాధికారుల సమీక్షలో వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై కూడా ఆంక్షలను త్వరలో విధించనున్నారు.