స్టాలిన్ కీలక నిర్ణయం... ఇక ప్రతి సన్ డే...?

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు.

Update: 2022-01-05 13:22 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతుండటంతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సినిమాహాళ్లు, మాల్స్ లో యాభై శాతం ఆక్యుపెన్సీ తోనే అనుమతించాలని స్టాలిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పాఠశాలలు....
ఇక తాజాగా ఆదివారం కూడా కర్ఫ్యూ విధించాలని స్టాలిన్ నిర్ణయించారు. దీంతో పాటు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని తమిళనాడు సర్కార్ నిర్ణయించింది. మరికొన్ని కఠిన ఆంక్షలను తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు 120కి పైగానే నమోదయ్యాయి.


Tags:    

Similar News