మళ్లీ పెరిగిన గోల్డ్ ధర

ఈరోజు దేశంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.640 రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది.

Update: 2022-03-25 02:10 GMT

బంగారం ధర పెరగడం సర్వ సాధారణమే. ధర తగ్గేది తక్కువ. పెరిగేది ఎక్కువగా అన్నట్లు ఉంటుంది. బంగారానికి డిమాండ్ ఎప్పుడూ తగ్గకపోవడమే ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులతో పాటు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనా బంగారం ధరల పెరుగుదలను పెద్దగా పట్టించుకోని భారతీయులు కొనుగోళ్ల మీద ఆసక్తిని ఏమాత్రం తగ్గించుకోరు. అందుకే బంగారం షాపులు నిత్యం కిటకిటలాడుతుంటాయి.

ధరలు ఇలా....
ఈరోజు దేశంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.640 రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,310 రూపాయలుగా ఉంది. అదే సమయంలో కిలో వెండి ధర 72,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News