స్థిరంగా బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వీటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.

Update: 2022-03-21 01:11 GMT

హైదరాబాద్ : బంగారాన్ని పెట్టుబడిగా చూసే వారున్నంతకాలం దానికి డిమాండ్ తగ్గదు. భారత్ లో పెట్టుబడిగా చూసే వారితో పాటు సెంటిమెంట్ గా చూసే వారు ఎక్కువ. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బంగారానికి డిమాండ్ తగ్గకపోవడానికి ఈ రెండే కారణాలని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. కరోనా వంటి క్లిష్టసమయంలోనూ బంగారం, వెండి కొనుగోళ్లు నిలకడగానే కొనసాగాయంటే దాని క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలు కొంత బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణాలుగా చూపుతున్నప్పటికీ, డిమాండ్ తగ్గకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు.

నిలకడగానే....
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వీటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 47,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News