భారీగా పడిపోయిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.600లు, కిలో వెండి పై వెయ్యి రూపాయలు తగ్గింది.

Update: 2022-03-16 01:26 GMT

బంగారం ధరలు దిగివస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. అన్నింటికంటే విలువైన వస్తువుగా భావించే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ఆశతో ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ధర తగ్గిన వెంటనే కొనుగోలు చేయాలని కొందరు. దానిని పెట్టుబడిగా మార్చుకోవాలని మరికొందరు ప్రయత్నిస్తుంటారు. గత కొంతకాలగా రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రతి రోజు ఎంతోకొంత పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తుంది.

వెండి కూడా....
అయితే ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.600లు, కిలో వెండి పై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,930 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధరలో వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News