మగువలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-03-23 01:27 GMT

బంగారం అనుకున్నట్లుగానే సామాన్యులకు అందనంత దూరంగా వెళ్లిపోతుంది. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకూ బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడు. సంపన్నులకు ధరలతో సంబంధం లేదు. వారి అవసరాలకు కొంత, పెట్టుబడి రూపంలో మరికొంత బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. కానీ సామాన్యుల విషయం అలా కాదు. సెంటిమెంట్ గా భావించే బంగారం ధరలు అందనంత పెరిగితే వారు కొనుగోలు చేసేందుకు ఇష్పపడరు. గత కొద్ది రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

వెండి కూడా....
బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కావచ్చు. మొత్తం మీద ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి పై రూ.600 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News