జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు
జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసి కోర్టు అధికారులను ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు నేలమాళిగల్లో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పూజలు చేసుకునేందుకు...
మసీదు ప్రాంగణంలో హిందూ దేవతలతో పాటు పురాణాలకు సంబంధించిన శాసనాలను కూడా పురావస్తు శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో వారం రోజుల్లో పూజలను ప్రారంభిస్తామని కాశీ విశ్వనాధ్ ట్రస్ట్ వెల్లడించింది. హిందువులకు ఇది అతి పెద్ద విజయమని ఆలయ ట్రస్ట్ పేర్కొంది. దీనిపై ముస్లిం వర్గాలు పై కోర్టును ఆశ్రయించే అవకాశముంది.