పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగాతుండగా, వెండి ధరలు మాత్రం బాగా తగ్గాయి
బంగారం కొనుగోలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆశతో ఎదురు చూస్తుంటారు. సొమ్ములు సమకూరగానే జ్యుయలరీ షాపుల వైపు పరుగులు తీస్తుంటారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం జ్యుయలరీ షాపులు నెలవారీ ఈఎంఐ స్కీమ్ లు కూడా బాగానే పెట్టింది. ఒక నెల ఈఎంఐ షాపు యాజమాన్యం కట్టుకునే విధంగా కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మరోవైపు బంగారాన్ని పెట్టుబడిగా భావించే వారు మాత్రం ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. భారత్ లో పసిడి కి ఉన్న డిమాండ్ కు ప్రధాన కారణం మన సంస్కృతిలో అది భాగం కావడమే.
బాగా తగ్గిన వెండి....
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగాతుండగా, వెండి ధరలు మాత్రం బాగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాయలు ఉంది. ఇక వెండి మాత్రం కిలోకు దాదాపు రూ.5,300 ల వరకూ తగ్గింది. హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో వెండి ధర 71,300 రూపాయలుగా ఉంది.