ఫస్ట్‌టైం.. బాలకృష్ణ టార్గెట్‌గా జగన్ హాట్ కామెంట్స్
సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తన ప్రసంగంలో.. ప్రతిపక్ష పార్టీ నేతలపై చురకలు అంటించారు. అయితే ఇవాళ కొత్తగా బాలకృష్ణపై హాట్ కామెంట్స్;
తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేత కార్మికులకు ‘వైఎస్‌ఆర్ నేతన్న హస్తం’ పథకం కింద ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. విడుదల అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తన ప్రసంగంలో.. ప్రతిపక్ష పార్టీ నేతలపై చురకలు అంటించారు. అయితే ఇవాళ కొత్తగా బాలకృష్ణపై హాట్ కామెంట్స్ చేశారు. దీనంతటికీ ప్రధాన కారణం వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలే అని స్పష్టంగా కనబడుతోంది. అయితే వైఎస్ జగన్ ఒకప్పుడు కడప బాలకృష్ణ అభిమానుల సంఘంలో సభ్యుడిగా ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ విమర్శలు చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
జగన్ తన ప్రసంగంలో 2016లో ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మహిళలపై బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రేక్షకులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో, టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ మహిళలపై “అభ్యంతరకరమైన” వ్యాఖ్యలు చేశారు. దానికి అతను విచారం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలను సీఎం జగన్ తిరగదోడారు. అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపన్నా చేయాలని ఇంకొక దౌర్భాగ్యుడంటాడు అంటూ సీఎం జగన్ కామెంట్ చేశారు.
2016లో ఓ ఈవెంట్‌లో బాలకృష్ణ తన ప్రసంగంలో అసభ్య వ్యాఖ్యలు చేశారు. ''అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పకోరు కదా. ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేయాలి. అంతే.. కమిట్ అయిపోవాలి..'' అని వ్యాఖ్యానించారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత బాలకృష్ణ క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలను వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ బాలకృష్ణ ఎలాంటి నైతికత లేని వ్యక్తి అని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం నెలకొనడంతో.. ముఖ్యంగా బాలకృష్ణను ఉద్దేశించి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. మరి ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.