చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కనిపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్
చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని విశ్లేషిస్తోంది. తాజాగా చంద్రుడి ఉఫరితలంలో సల్ఫర్ మూలకాన్ని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. చంద్రుడి పుట్టుకకు, ఆవాస యోగ్యతకు ఈ తాజా ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ‘‘చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ మూలకం జాడలను నిర్దిష్టంగా, స్పష్టంగా ప్రజ్ఞాన్ రోవర్ పై ఉన్న లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) గుర్తించింది’’ అని ఇస్రో ప్రకటించింది. కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, అల్యూమినియం వంటి ఇతర మూలకాల జాడలను కూడా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో ప్రకటించింది.
చంద్రుడిపై పలు ఖనిజాలను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించినట్టు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంపై మాంగనీస్ (Mn), ఇనుము (Fe), టైటానియం (Ti), కాల్షియం (Ca), సల్ఫర్ (Fe), క్రోమియం (Cr), అల్యూమినియం (Al), సిలికాన్ (Si) వంటి మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్‌లో అమర్చిన లేజర్ -ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) ధృవీకరించింది.
దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా పంపింది. జాబిల్లి ఉపరితలంపై 50.5 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా.. 80 మి.మీల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్ గుర్తించింది. ల్యాండింగ్ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు 20- 30 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.