ఎఫ్.సి.ఎన్ వ్యవస్థాపకులు డా॥ ఏరువ గీత గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారం

పేదల సేవే పరమావధిగా భావించిన డాక్టర్.గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు 2002వ సంవత్సరంలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థను స్థాపించి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వందల మంది పేద, అనాధ విద్యార్థులు సహాయం పొంది ఇప్పటికే దేశ, విదేశాలలో స్థిరపడ్డారు.

Update: 2024-01-22 06:23 GMT

పేదల సేవే పరమావధిగా భావించిన డాక్టర్.గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు 2002వ సంవత్సరంలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థను స్థాపించి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వందల మంది పేద, అనాధ విద్యార్థులు సహాయం పొంది ఇప్పటికే దేశ, విదేశాలలో స్థిరపడ్డారు. ఈ సంవత్సరం పాఠశాల విద్యార్థులకు 40 వేల నోటు పుస్తకాలు, 1500 స్కూల్ బ్యాగులు, 12 వేల డిక్షనరీలు, పాఠశాలలకు లైబ్రరీ పుస్తకాలు, వృద్ధులు, పేదలకు 3500 దుప్పట్లు,12 వేల మందికి బట్టలు పంపిణీ చేశారు. డాక్టర్. గీతా గారు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం, హైస్కూల్ మరియు కళాశాల విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించి వారి సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియపరుస్తూ ఉచితంగా పుస్తకాలను అందజేస్తున్నారు.

గ్రహణమొర్రి బాధిత చిన్నారుల మోములో చిరునవ్వులు పూయించేందుకు ప్రతి నెల క్యాంపుల ద్వారా శస్త్రచికిత్సలు చేయించడమే కాక రానుపోను ప్రయాణ ఖర్చులు ఉచితంగా అందజేస్తున్నారు. గత 9 సంవత్సరాల లో ఇప్పటివరకు రెండు వేల మందికి ఆపరేషన్లు నిర్వహించారు. కండర క్షీణత వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని వంద మంది వ్యాధి బాధితులను గుర్తించి సంవత్సరానికి 16 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. పేద, వితంతు మహిళలు మరియు ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు ఆపేసిన యువతులకు ప్రతి సంవత్సరం 30 మందిని ఎంపిక చేసి తొమ్మిది నెలల పాటు కుట్టులో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేసి వారి జీవనోపాధికి బాటలు వేస్తున్నారు.

హైదరాబాద్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో షాద్ నగర్ సమీపంలో ఆరు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో2019 సంవత్సరంలో ఎఫ్. సి. ఎన్. హోమ్ స్థాపించి వృద్ధులు నడవడానికి అనువైన రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో, పూదోటలతో ఆహ్లాదకరంగా ఉంది. సొంత ఇంటిని మైమరిపించేలా గదులు, మినరల్ వాటర్, స్నానానికి వేడి నీటి సౌకర్యం, పౌష్టికాహారం అందిస్తున్నారు. డాక్టర్. గీతా గారి పర్యవేక్షణలో నలుగురు సిస్టర్స్ తో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎఫ్.సి. ఎన్. సంస్థ ఆపన్న హస్తాన్ని అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాంటి ఘోర విపత్తు సమయాలలో దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయాన్ని అందించి మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు ఈ సేవా మూర్తులు. అలా వీరి సేవలను గుర్తించిన ఎన్నో సంస్థలు, ప్రభుత్వాలు వీరికి 'వైద్యరత్న', 'విద్యారత్న', 'సేవా రత్న' అవార్డులను అందించాయి. డిసెంబర్ 22, 2023న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీయుతులు అనుముల. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డాక్టర్. గీతా గారికి విశిష్ట సేవా పురస్కారాన్ని అందించడం మనందరం గర్వించదగ్గ విషయం

Tags:    

Similar News