ప్రపంచంలోనే మన విస్కీయె టాప్...
భారతదేశంలో తయారైన విస్కీని ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ బ్రాండ్‌గా విస్కీస్ ఆఫ్ ది వరల్డ్
భారతదేశంలో తయారైన విస్కీని ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ బ్రాండ్‌గా విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ ఎంపిక చేసింది. 'ఇంద్రి దీపావళి కలెక్టర్ ఎడిషన్ 2023' ప్రపంచంలోని అతిపెద్ద విస్కీ-టేస్టింగ్ పోటీలలో ఒకటైన 'డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో' అవార్డును అందుకుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100 రకాల విస్కీ బ్రాండ్ లు పోటీపడ్డాయి. భారతదేశానికి చెందిన విస్కీ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.
ఇండియన్ మేడ్ విస్కీ ఇంద్రి దీపావళి కలెక్టర్ ఎడిషన్ 2023.. ఈ ఏడాదికి గానూ విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్’ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద విస్కీ టేస్ట్ కాంపిటీషన్ లో ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీ అవార్డు గెలుచుకుంది. విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100 రకాల విస్కీల బ్రాండ్ ల మధ్య పోటీని నిర్వహిస్తుంది. ఎంతో మంది న్యాయనిర్ణేతలు ఉంటారు. బోర్బన్, కెనడియన్, ఆస్ట్రేలియన్, బ్రిటిష్ సింగిల్ మాల్ట్లతో సహా వందలాది అంతర్జాతీయ బ్రాండ్లను ఓడించింది మేడ్ ఇన్ ఇండియా విస్కీ. 2021లో ఈ బ్రాండ్ ప్రారంభమైంది. హర్యానాలోని పికాడిల్లీ డిస్టిలరీస్ నుండి వచ్చిన స్వదేశీ బ్రాండ్. ఇది ట్రిపుల్-బ్యారెల్ సింగిల్ మాల్ట్ విస్కీ. గత రెండేళ్లలో.. 14 కంటే ఎక్కువ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ 2023లో 'బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్' అవార్డును సొంతం చేసుకుంది.
ఇంద్రి-ట్రిని భారతదేశంలోని 19 రాష్ట్రాలు, 17 ఇతర దేశాలలో అందుబాటులో ఉంది. నవంబర్ నుండి అమెరికా సహా.. కొన్ని యూరోపియన్ దేశాలలో కూడా అందుబాటులో ఉంటుంది. దేశంలోని విస్కీ ప్రేమికులు భారత్ బ్రాండ్ కు దక్కిన అరుదైన గౌరవంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.