చంద్రుడిపై భూమిని కొనలేము
ఇంతకూ చంద్రుడిపై మనం భూమిని కొన్నంత మాత్రాన అది మన సొంతం అవుతుందా
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్- వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోగవర్నర్ కిమ్ రెనాల్స్ వద్ద ప్రాజెక్టు మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా పని చేస్తున్నారు. చంద్రుడిపై భూమి కొనుగోలు చేయవచ్చని తెలుసుకున్న సాయి విజ్ఞత తాను తన తల్లికి బహుమతిగా చంద్రుడిపై స్థలాన్ని కొనివ్వాలని నిర్ణయించుకుంది. చంద్రుడిపై భూమి కొనుగోలుకు లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తన తల్లి వకుళ, మనుమరాలు ఆర్త సుద్దాల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.
పలువురు ప్రముఖులు కూడా చంద్రుడిపై భూమిని కొన్నట్లు చెప్పారు. దీంతో చాలా మంది కాస్త వెరైటీగా చేద్దామని చంద్రుడిపై భూమిని కొన్నారు. ఇంతకూ చంద్రుడిపై మనం భూమిని కొన్నంత మాత్రాన అది మన సొంతం అవుతుందా..? అంటే అందుకు సమాధానం 'లేదు' అనే వస్తుంది. చంద్రుడిపై భూమిని తమ సొంతం అని చెప్పుకునే హక్కు ఎవరికీ లేదు.