National Girl Child Day: జాతీయ బాలికా దినోత్సవ చరిత్ర, లక్ష్యాలు

భారతదేశంలో మొదటిసారిగా 24 జనవరి 2008న జాతీయ బాలికా దినోత్సవాన్ని

Update: 2024-01-24 06:09 GMT

National Girl Child Day భారతదేశంలో మొదటిసారిగా 24 జనవరి 2008న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించడాన్ని మొదలుపెట్టారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జనవరి 24, 1966న ఇందిరా గాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే జనవరి 24ని జాతీయ బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు. ఏటా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రధానంగా మూడు లక్ష్యాలను పెట్టుకున్నారు. మొదటిది, దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తిచూపడం.. రెండోది ఆడపిల్లల హక్కుల గురించి అవగాహన పెంపొందించడం. మూడవది.. బాలిక విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం.

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా... దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవగాహనా సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బాలికల రక్షణ, చదువు దిశగా ప్రయత్నిస్తోంది. బాలికల సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తోంది. భారత రాజ్యాంగం ఆడ, మగ ఇద్దరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ లింగవివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. దేశంలో ఇప్పుడు మగ పిల్లలకు వివాహాలు చేయడానికి ఆడపిల్లలు దొరకని పరిస్థితి వచ్చింది. చట్టాలు ఎన్ని ఉన్నా బాలికల పట్ల జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దేశంలో బాలికలకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడమే జాతీయ బాలికా దినోత్సవం లక్ష్యం. బేటీ బచావో-బేటీ పఢావో లాంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయని ఆశిద్దాం.


Tags:    

Similar News