Big Alert : ఆ యాప్ వాడుతున్నారా ఇక అంతే సంగతులు !!
తక్కువ సమయంలోనే అవసరానికి తగ్గ డబ్బులు దొరుకుతాయని
తక్కువ సమయంలోనే అవసరానికి తగ్గ డబ్బులు దొరుకుతాయని మనం యాప్స్ లో నుండి డబ్బులు తీసేసుకుంటూ ఉంటాం. అయితే మనం ఏ యాప్స్ లో నుండి తీసుకుంటున్నామో కూడా కాస్త దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైన విషయమే..! ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనం డబ్బులు చెల్లించకపోతే ఊహించని విధంగా టార్చర్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఎంతో మంది యాప్స్ లో లోన్స్ ను తీసుకుని కట్టకపోయేసరికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈఎంఐ అనుకున్న సమయానికి కట్టకపోతే మానసికంగా కుంగదీసేలా చేయడం ఏజెంట్స్ పని!!
తాజాగా పోస్ట్ పే యాప్ ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో బయటపెట్టాడు. తాను తీసుకున్న లోన్ కు సెటిల్మెంట్ చేస్తానని డిసెంబర్ 1 దాకా గడువు అడిగానని ఇంతలోనే పోస్ట్ పే ఏజెంట్స్ టార్చర్ చేయడం మొదలుపెట్టారని చెప్పుకొచ్చాడు. తన కుటుంబ సభ్యులకు, తన కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారని వాపోయాడు. ఏ మాత్రం నైతిక విలువలు పాటించకుండా ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని బాధను వ్యక్తం చేశాడు. తనకు ఫోన్ చేసి వేధిస్తున్న వ్యక్తుల మొబైల్ ఫోన్ నెంబర్లను కూడా సదరు వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. లలిత్ బిష్త్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా.. ఢిల్లీ పోలీసులు, ఆర్బీఐ ను కూడా ట్యాగ్ చేశారు.