పులస చేప.. వామ్మో అంత ధరనా?

పులస చేప.. ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు

Update: 2023-09-06 09:12 GMT

పులస చేప.. ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇవి దొరకడం చాలా అరుదు. దొరికినా ధర భారీగానే పలుకుతుంది. ఎప్పుడో.. దొరుకుతూ ఉంటాయి. అలా దొరికినప్పుడు వేలం పాట పాడేస్తూ ఉంటారు. ఒకటి, రెండు కేజీల చేపలు మార్కెట్‌లోకి రాగానే అమ్ముడుపోతూ ఉంటాయి. తాజాగా కాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఓ పులస దొరకగా.. అది కాస్తా రికార్డు ధరకు అమ్ముడుపోయింది. పుష్కరఘాట్‌ వద్దకు మత్స్యకారుడు వనమాడి ఆదినారాయణ వేటకు వెళ్లారు. రెండు కిలోలకుపైగా బరువున్న పులస చేప చిక్కింది. వెంటనే ఆ చేపను మార్కెట్‌కు తీసుకెళ్లగా.. అక్కడ కొల్లు నాగలక్ష్మి వేలంలో రూ.19 వేలకు దక్కించుకున్నారు. ఇంతలో మరో వ్యక్తి రావులపాలెంకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కోసం ఆమె నుంచి రూ.26 వేలకు కొనుక్కుని తీసుకువెళ్లారు. ఎంతో మంది పులస చేపలు మార్కెట్ లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత పులస దొరకడంతో రికార్డు ధర పలికింది.

ఫసిఫిక్ మహా సముద్రంలో జీవించే హిల్సా ఇలీషా అనే పేరు గల వలస జాతి చేపలు ఖండాలను దాటి హిందూ మహా సముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. అనంతరం గోదావరిలోకి చేరుతాయి. వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లుపెట్టి సంతానోత్పత్తి జరుగుతుంది. సముద్రంలోని ఉప్పునీటిలో ఉండేటప్పుడు వీటిని విలస చేపలుగా పిలుస్తారు. గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుకుంటూ పులసగా మారిపోతుంది. ఈ ఎర్రటి గోదావరి నీటిలో ఎదురీదడం వల్ల విలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారుతుంది. పులస ఒకప్పుడు కిలో రూ.1500 నుంచి రూ.4,000 వరకు ఉండేది. కానీ ఇప్పుడు అది కాస్తా రూ.13 వేలు వరకు వెళ్లిపోయింది. ఒక్కసారి ఈ పులస పులుసు తిన్నవారు జీవితంలో మర్చిపోలేరని అంటుంటారు.


Tags:    

Similar News