QR కోడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి: మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

QR కోడ్‌.. క్విక్ రెస్పాన్స్ కోడ్. జస్ట్ స్కాన్ చేయడం.. ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం. మన దేశంలో రోజూ కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ క్యూఆర్ కోడ్స్ ద్వారా డబ్బులు మారుతూ ఉంటాయి. ఒక దశాబ్దం క్రితం భారతదేశంలో ఇంత భారీ ఎత్తున QR కోడ్‌స్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

Update: 2024-02-02 12:44 GMT

QR కోడ్‌.. క్విక్ రెస్పాన్స్ కోడ్. జస్ట్ స్కాన్ చేయడం.. ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం. మన దేశంలో రోజూ కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ క్యూఆర్ కోడ్స్ ద్వారా డబ్బులు మారుతూ ఉంటాయి. ఒక దశాబ్దం క్రితం భారతదేశంలో ఇంత భారీ ఎత్తున QR కోడ్‌స్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

QR కోడ్‌ అంటే ఏమిటి?

QR కోడ్ అనేది టూ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బార్‌కోడ్ రకం. జపాన్‌లో అభివృద్ధి చేశారు. గరిష్టంగా 4296 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను నిల్వ చేయగలదు. ఆన్ లైన్ చెల్లింపును సులభతరం చేసే విధంగా ఏ దిశలోనైనా స్కాన్ చేయవచ్చు. భారతప్రభుత్వం నగదు రద్దును ప్రవేశపెట్టాక.. భారతదేశంలో QR కోడ్ విషయంలో జనాదరణ బాగా పెరిగింది. ఇక కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉన్న సమయంలో కూడా లావాదేవీల విషయంలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు అవకాశం ఎక్కువగా ఉండేది. అప్పటి నుండి కూరగాయల విక్రేతల వంటి చిన్న వ్యాపారాలు కూడా చెల్లింపుల కోసం QR కోడ్‌లను ఉపయోగిస్తున్నాయి. QR కోడ్‌ల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలా సులభంగా ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్ కు డబ్బులు పంపడమే కాకుండా.. లావాదేవీలకు తీసుకునే సమయం తగ్గుతూ ఉన్న కారణంగా కూడా ప్రజాదరణ బాగా ఉంటోంది.
వినియోగదారులు ఎక్కువగా QR కోడ్ ద్వారా చెల్లింపులకు ఇష్టపడుతూ ఉంటారు. నగదు లేదా క్రెడిట్ కార్డ్‌లను తీసుకెళ్లడానికి బదులుగా స్మార్ట్‌ఫోన్‌లతోనే పేమెంట్స్ చేయవచ్చు. మెనూలు, కూపన్‌లు, వెబ్‌సైట్‌లకు చేరుకోడానికి కూడా QR కోడ్‌లు ఉన్నాయి.
భారతదేశంలో QR కోడ్ 'ఫిషింగ్' లేదా 'క్విషింగ్' పద్ధతులను ఉపయోగించి డబ్బులను కొట్టేయాలని కొందరు చూస్తూనే ఉంటారు. డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి QR కోడ్‌ల ఉపయోగం పెరుగుతోంది. USA, భారత్ మొదలైన దేశాలలో డబ్బులను దోచుకోడానికి కేటుగాళ్లు క్విషింగ్ ద్వారా స్కామ్ చేస్తున్నారు.

క్విషింగ్ అంటే ఏమిటి?

క్విషింగ్‌లో భాగంగా.. స్కామర్ ఓ QR కోడ్‌ను సృష్టిస్తాడు, బాధితులు ఎవరైనా స్కాన్ చేసినప్పుడు.. అది వినియోగదారులను నిజమైన వెబ్‌సైట్‌ను తీసుకుని వెళ్లకుండా అచ్చం అలాంటి స్కామింగ్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ వినియోగదారుని వ్యక్తిగత సమాచారం లేదా ఖాతా వివరాలను నమోదు చేయమని కోరుతుంది. వినియోగదారుడు లింక్ ను ఓపెన్ చేశాక.. సమాచారం స్కామర్‌కు పంపుతారు.. డబ్బును దొంగిలించడానికి లేదా గుర్తింపు దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంటుంది.
QR కోడ్‌లు బాధితుడిని డబ్బు పంపడానికి వారి UPI పిన్‌ను నమోదు చేయమని అడిగే అవకాశాలు కూడా ఎక్కువే. వినియోగదారు పిన్‌ను నమోదు చేసినప్పుడు, స్కామర్ ఆ పిన్ డీటైల్స్ సొంతం చేసుకుంటాడు.. వెంటనే బాధితుడి బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలిస్తాడు. ఇక QR కోడ్‌లలో హానికరమైన ఫైల్‌లు కూడా ఉండవచ్చు, అవి QR స్కాన్ చేసిన వెంటనే డౌన్‌లోడ్ అవుతాయి. బాధితుల ఫోన్, ఫోన్‌లోని అన్ని వ్యక్తిగత వివరాలను ప్రభావితం చేస్తాయి.
కొన్ని QR కోడ్‌ల ద్వారా సోషల్ మీడియా ఖాతాలపై నియంత్రణను పొందే అవకాశం ఉంది. మీ అకౌంట్ల ద్వారా ఇమెయిల్‌లు, సందేశాలను పంపడం వంటి పలు కార్యకలాపాలను చేయడానికి స్కామర్‌ లు మీ అకౌంట్లను వాడుకునే అవకాశాలు ఉన్నాయి.

క్యూఆర్ కోడ్ ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

క్విషింగ్ స్కామ్‌కు బలవ్వకుండా ఉండటానికి.. అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. QR కోడ్‌ని స్కాన్ చేసే ముందు, అది చట్టబద్ధమైనదా.. కాదా అని కూడా తనిఖీ చేయండి. వెబ్‌సైట్ లేదా డౌన్‌లోడ్ లింక్‌కి దారితీసినప్పుడు, URLలు చట్టబద్ధమైనవా, సురక్షితమైనవా అని తనిఖీ చేయండి. వెబ్‌సైట్ URLలోని HTTPS వెబ్‌సైట్ సురక్షితమైందా కాదా అని తెలియజేస్తుంది. వెబ్‌సైట్ సంబంధిత లావాదేవీకి సంబంధించిన వ్యాపారానికి చెందినదా.. లేదా అని కూడా URL తెలియజేస్తుంది. మోసపూరిత వెబ్‌సైట్‌స్ పేరులో స్పెల్లింగ్ లోపాలు, హైఫన్‌లను కూడా మీరు గుర్తించవచ్చు.
ప్రామాణికమైన వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించాలి:

‘about us’ పేజీని చదవడం ద్వారా చాలా వివరాలను మనం తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్ ను ఎవరు సృష్టించారు.. ఎందుకోసం తయారు చేశారు అనే చాలా విషయాలను తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్ ప్రామాణికతను తనిఖీ చేయాలి. స్కామర్‌లు వెబ్‌సైట్‌లను కాపీ చేయడంలోనూ.. వాటిని నిజమైనవిగా కనిపించేలా చేయడంలో చాలామంది నిపుణులు కూడా భాగమై ఉంటారు. ఇక వెబ్‌సైట్ చట్టబద్ధతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. పేజీ లేఅవుట్‌లు URLలను జాగ్రత్తగా పరిశీలించి నకిలీ వెబ్‌సైట్‌లను గుర్తించవచ్చు.

థర్డ్ పార్టీ స్కానర్‌లను నమ్మొద్దు:

థర్డ్-పార్టీ యాప్‌లు లేదా ఆన్‌లైన్ స్కానర్‌లను నమ్మకండి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మీ పరికరంలో అంతర్నిర్మిత QR స్కానర్‌ని ఉపయోగించండి.

మీ ఆన్‌లైన్ ఖాతాలపై మల్టీ ఫ్యాక్టర్ అతెంటికేషన్ ను ప్రారంభించండి:

మీరు మోసపూరిత వెబ్‌సైట్‌ను సందర్శించి మోసపోయినా.. మీరు మీ పాస్‌వర్డ్‌ను బహిర్గతం చేసినా.. సైబర్ నేరస్థులు ఇప్పటికీ ఆ సమాచారాన్ని ఉపయోగించలేరు. వారు మీ ఇతర ప్రమాణీకరణ సాధనాలకు (Google Authenticator యాప్ వంటివి) యాక్సెస్ ఉండదు.

ఆలోచించండి.. ప్రతిస్పందించండి:

వ్యక్తిగత సమాచారం కోసం క్విషింగ్ దాడి జరుగుతూ ఉంటుంది. ఈ స్కామ్‌లకు ప్రతిస్పందించి సంబంధిత చర్యలను కూడా చేపట్టండి.

అసలైన కోడ్‌లు సాధారణంగా వ్యక్తిగత డేటాను అడగవు. పేరున్న సైట్లు వ్యక్తిగత వివరాలు అడగవని గమనించండి. ఇలాంటి భయాలు ఉన్నప్పటికీ, అప్రమత్తంగా ఉండటం, కామన్ సెన్స్ ను ఉపయోగించడం చాలా ముఖ్యం. లింక్ లు క్లిక్ చేసే ముందు, క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేసే ముందు కొంచెం ఆలోచించి వ్యవహరిస్తే సంబంధించిన దాడులను సులభంగా నివారించవచ్చు.
Tags:    

Similar News