T20 World Cup : కుర్రోళ్లతోనే టీం ఇండియా.. కొత్త ప్రయోగమేగా
టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత తుది జట్టును ఎంపిక చేసింది.
టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది.ఇందులో కేఎల్ రాహుల్ కు చోటు దక్కలేదు. పంత్ కు మళ్లీ స్థానం దక్కింది. ఐపీఎల్ లో మంచి పెర్‌ఫార్మెన్స్ చూపుతున్న ఆటగాళ్లకు టీ 20 వరల్డ్ కప్ లో చోటు కల్పించింది. సీనియర్ ఆటగాళ్లను చాలా వరకూ పక్కన పెట్టింది. ఒక్క రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహాయించి అంతా కుర్రాళ్లకే అవకాశాలు కల్పించింద.ి
జట్టు ఎంపికలో...
టీమ్ ను ఎంపిక చేయడంలో అనేక రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. ఆల్ రౌండర్లతో పాటు ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో సత్తా ఉన్న వారినే ఎంపిక చేసింది. డెత్ ఓవర్లలో ఆడగలిగే వారిని కూడా ఈ జట్టులో స్థానం కల్పించినట్లు అర్థమవుతుంది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ పరంగా సమతూకం పాటిస్తూ జట్టు ఎంపిక చేసింది.
జట్టు ఇదీ...
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శివమ్ దూబే, పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, చాహల్, సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ ను ఎంపిక చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ లను ఎంపిక చేసింది.