రెండో టెస్ట్ లో చేతులెత్తేసిన టీం ఇండియా

రెండో టెస్ట్ లో భారత్ బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేశారు. అతి తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ అయ్యారు.

Update: 2022-03-12 13:24 GMT

రెండో టెస్ట్ లో భారత్ బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేశారు. అతి తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ అయ్యారు. శ్రీలంక స్పిన్నర్ల దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ లు విలవిలలాడిపోయారు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండో టెస్ట్ భారత్ - శ్రీలంక ఈరోజు ప్రారంభమయింది. పింక్ బాల్ టెస్ట్ కావడంతో డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్ లోనే టీం ఇండియా 252 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ఒక్కడే వీర బాదుడు..
భారత్ బ్యాట్స్ మెన్ లలో శ్రేయస్ అయ్యర్ 92 పరుగులు చేశారు. పది ఫోర్లు, నాలుగు సిక్స్ లు బాదాడు. అలాగే రిషబ్ పంత్ 39 పరుగులు, హనుమ విహారి 31 పరుగులు చేశారు. మిగిలిన వారంతా అతి తక్కువ స్కోరుకు అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమలు చెరో వికెట్ తీసుకున్నారు. 59 ఓవర్లకే టీం ఇండియా ఆల్ అవుట్ అయింది. ఇక భారత్ బౌలర్లు విజృంభిస్తేనే తప్ప డ్రా దిశగానైనా టెస్ట్ సాగదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.


Tags:    

Similar News