IPL 2025: ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే.. రెండు నెలలు కంటి నిండా నిద్ర కరువే

నేటి నుంచి ఐపీఎలస్ సీజన్ 18 ప్రారంభం కానుంది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో తొలి మ్యాచ్ జరగనుంది.;

Update: 2025-03-22 04:15 GMT
IPL season 18,  today,  eden gardens,  kolkata
  • whatsapp icon

ఐపీఎల్ అంటేనే అదొకమజా. కళ్లుచెదిరిపోయే షాట్స్. అదిరిపోయే క్యాచ్ లు. వికెట్లను అమాతం దొరకబుచ్చుకునే బౌలర్లు. అత్యంత వేగంగా సెంచరీలు. అర్థ సెంచరీలు.. రికార్డుల బద్దలే. ఐపీఎల్ ప్రారంభమవుతుందంటే క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఐపీఎల్ డేట్స్ దాదాపుగా ఖరారయ్యాయి. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభమవుతుంది. మొత్తం పది జట్లు ఈ ఐపీఎల్ సీజన్ లో పాల్గొననున్నాయి. మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి. మే నెల వరకూ ఈ మ్యాచ్ లు జరుగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఒకరకంగా ఫెస్టివల్ అనే చెప్పాలి. థోనీతో పాటు అందరు ప్లేయర్స్ ను మైదానంలో చూసే అవకాశం ఐపీఎల్ లోనే లభిస్తుండటంతో ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

అభిమాన ఆటగాళ్లందరినీ...
ఐపీఎల్ సీజన్ ప్రారంభమయిందంటే క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే. తమకు ఇష్టమైన జట్లతో పాటు తమ అభిమాన ఆటగాళ్లందరినీ మైదానంలో చూసే వీలుంది. అందుకే ఐపీఎల్ కు భారత్ లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రతి సీజన్ కు వ్యూయర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. స్టేడియంలతో పాటు టీవీలను అతుక్కుపోయి అర్ధరాత్రి వరకూ చూసే వారి సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. ఇక భారత్ క్రికెట్ కు ఐపీఎల్ మరో అరుదైన అవకాశం ప్రతి సీజన్ లో దక్కుతుంది. ఐపీఎల్ లో ఆడి అంతర్జాతీయ మ్యాచ్ లకు ఎంపిక చేయడం బీసీసీఐకి సులువుగా మారుతుంది. నిలకడగా ఆడే తీరుతో పాటు అలరించే షాట్స్ కొట్టేవారితో పాటు, వికెట్లను దొరకబుచ్చుకునే వారిని సులువుగా ఎంపిక చేసుకునే వీలుంది. ఇలా అనేక మంది ఐపీఎల్ సీజన్ లో మెరిసి అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడుతూ టీం ఇండియాకు అనేక విజయాలను అందిస్తున్న యువ క్రికెటర్ల జాబితా చాంతాడంత ఉంది.
వజ్రాలను వెలికి తీసే...
నిజానికి ఐపీఎల్ అంటే కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లను ఫ్రాంచైజ్ లు తాము ఎంపిక చేసుకుంటాయి. ఏదో ఒక మ్యాచ్ లో అవకాశం దక్కుతుంది. ఆ మ్యాచ్ లో హిట్ అయితే చాలు ఇక జీవితం క్రికెట్ లో స్థిరపడినట్లే. ఒక్కసారిగా మారిపోయినట్లే. అలా మారిపోయిన వాళ్లు అనేక మంది ఇప్పుడున్నారు. ఇప్పుడు టీం ఇండియా టీ20 జట్టులో ఉన్న అత్యధిక శాతం మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడి తమ సత్తాను చూపి సెలెక్టర్ల దృష్టిలో పడిన వారే. సీనియర్ ఆటగాళ్లు ఒకింత డీలాపడినా యువ ఆటగాళ్లతో భారత్ నేటికీ కళకళలాడుతుందంటే అది ఐపీఎల్ పుణ్యమే. అందుకే ఐపీఎల్ వస్తుందంటే ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు బీసీసీఐకి కూడా ఫెస్టివల్ వంటిదే. డబ్బుకు డబ్బు. మేలురకపు ఆటగాళ్ల కోసం పెద్దగా శ్రమపడకుండానే అందిపుచ్చుకునే ఛాన్స్ లభించడం. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లు ఇలా ఐపీఎల్ లో ఒక ఆటాడి టీం ఇండియాలో స్థానం సంపాదించుకున్నవారే. అలాగే మరింత మంది మన తెలుగోళ్లు కూడా ఐపీఎల్ లో ఆడి టీం ఇండియాలో స్థానం దక్కించుకోవాలని కోరుకుందాం.


Tags:    

Similar News