IPl 2025 : నేడు మరో సూపర్ మ్యాచ్
ఐపీఎల్ సీజన్ రెండో రోజు హైదరాబాద్ లో మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడుతుంది;

ఐపీఎల్ సీజన్ రెండో రోజు హైదరాబాద్ లో మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ గత సీజన్ లో అత్యధిక పరుగుల చేసి రికార్డులను సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగా ఉంది. రెండు జట్లు బలంగా ఉండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది.
గణాంకాలు...
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గణాంకాలు సన్ రైజర్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఆరు మ్యాచ్ లలో ఐదింటిలో సన్ రైజర్స్ గెలిచింది. రాజస్థాన్ తో తలపబడిన మూడు మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ నెగ్గింది. ఇప్పటికే స్టేడియంలో టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.