IPL 2025 : కావ్యపాప ఆనందాన్ని కెమెరాలు ప్రతి ఫ్రేములో బంధించాయిగా?
ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన పరుగులు చేయడంతో జట్టు ఓనర్ కావ్య పాప ఖుషీ అయింది.;

ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన పరుగులు చేయడంతో జట్టు ఓనర్ కావ్య పాప ఖుషీ అయింది. ఈ స్టేడియంలో సన్ రైజర్స్ పరుగుల రికార్డు నమోదు చేసింది. సిక్సర్లు, ఫోర్లతో సన్ రైజర్స్ బ్యాటర్లు మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేసి అవుటయ్యాడు. తక్కువ పరుగులకే అవుటయినా ఇషాన్ కిషన్ లు మాత్రం సెంచరీ నమోదు చేశాడు. ఇక . క్లాసేన్ ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. హైదరాబాద్ బ్యాటర్లు దంచి కొడుతుండటంతో కావ్య పాప ఖుషీని వేరే చెప్పాల్సిన పనిలేదు.
సిక్సర్, ఫోర్ బాదినప్పుడల్లా...
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే కావ్య పాప ఆనందానికి అవధులు లేవు. అత్యధిక స్కోరు సాధిస్తామన్న నమ్మకంతో ఎగిరి గంతేసింది. ఓవర్ రన్ రేట్ 14 కు పైగానే ఉంది. 20 ఓవర్లకు 286 పరుగులు చేసింది. గతంలో నూ ఇదే ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 280 పరుగులు చేసి ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు నమోదు చేసింది. చివరకు 20 ఓవర్లకు 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 287 గా ఉంది. అయితే ఇషాన్ కిషన్ సెంచరీ, క్లాసెన్ ఫోర్లు, సిక్సర్లు, హెడ్ ఆడిన తీరు చూసి కావ్య పాప ఖుషీ అయింది.
రెండు వికెట్లు కోల్పోయి...
ఇక 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలి నాలుగు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైశ్వాల్ అవుటయ్యాడు. పరాగ్ కూడా పెవిలియన్ దారి పట్టాడు. దీంతో కావ్య పాప స్టేడియంలో చిందులేయడం కనిపించింది. తన చపట్లతో జట్టు లో హుషారును పెంచుతూ ఫ్యాన్స్ లో కూడా కిక్కు నింపింది. కెమెరాలన్నీ కావ్య పాప వైపు చూపుతుండటంతో స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వికెట్ పడినప్పుడల్లా కావ్య ఆనందం చూసి తీరాల్సిందేనన్నట్లు అనిపించేలా సాగింది.