IPL 2025 : తొలి రోజు కళ్లు చెదిరే సిక్సర్లు.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దే విజయం

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సునాయాసంగా విజయం సాధించింది;

Update: 2025-03-23 03:40 GMT
royal challengers bengauluru, won,  kolkata knight riders, IPL 2025
  • whatsapp icon

ఐపీఎల్ అభిమానులను అలరించే మ్యాచ్ నిన్న కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన పోటీలో క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు బైర్లు కమ్మేలా సిక్సర్లు కనిపించాయి. అలాగే ఫోర్లతో ఒక ఆటాడుకును్నారు. నిన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సునాయాసంగా విజయం సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే గత సీజన్ ఛాంపియన్స్ ను అలా పడుకోబెట్టేసింది. వారికి అచచొకచ్చిన మైదానం అని భావించే లోగానే రాయల్ ఛాలెంజర్స్ గెలుపును సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఉన్న ఈ జట్టు ఆడిన తీరును చూసి ఫ్యాన్ ఖుషీ అయ్యారు. తొలి బోణీ కొట్టి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఈసారి ఛాంపియన్ షిప్ రేసులో తామున్నామని చెప్పకనే చెప్పినట్లయింది.

తొలుత బలమైన పునాది వేసినా...
తొలుత టాస్ గెలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపు ఛాలెంజర్స్ బౌలర్లను కోల్ కత్తా నైట్ రైడర్స్ చితక్కొటుడుకొట్టారు. ముఖ్యంగా అజింక్యా రహానే, సునీల్ నరైన్ లు క్రీజును అతుక్కుపోయి ఉండటంతో స్కోరు ఇరవై ఓవర్లకు 280 వరకూ చేస్తుందన్న అంచనాలు కూడా వినిపించాయి. కానీ రహానానే 56 పరుగులు వద్ద, నరైన్ 44 పరుగుల వద్ద అవుట్ కావడంతో నైట్ రైడర్స్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. బలమైన పునాది వేసినప్పటికీ నైట్ రైడర్స్బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కృనాల్ పాండ్యా మూడు, హేజిల్ వుడ్ రెండు వికెట్లు తీసి నైట్ రైడర్స్ వెన్ను విరిచారు. ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేసింది.
ఛేజింగ్ లో...
తర్వాత ఛేజింగ్ లో బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వెనుదిరిగి చూడలేదు. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. విరాట్ కోహ్లి 59 పరుగులు చేశాడు. అందులో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లున్నాయి. సాల్ట్ యాభై పరుగులు చేశాడు. అందులో రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. దీంతో లక్ష్యం చిన్నది కావడం, ఓపెనర్లిద్దరూ మంచి స్కోరు చేయడంతో ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం దాదాపు ముందే ఖాయమయింది. చివరకు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. కోహ్లి, సాల్ట్ ఫుల్ ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బౌలింగ్ ను బలోపేతం చేసుకుంటే కప్పు ఈసారి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దేనంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. పెద్దగా టెన్షన్ లేకుండా తొలి మ్యాచ్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సులువుగా సొంతం చేసుకుంది.






Tags:    

Similar News