IPL 2025 : దంచి కొట్టిన సన్ రైజర్స్ బ్యాటర్లు

ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల రికార్డు నమోదు చేసింది.;

Update: 2025-03-23 11:58 GMT
sunrisers hyderabad, record, rajasthan royals, uppal stadium
  • whatsapp icon

ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల రికార్డు నమోదు చేసింది. సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 24 పరుగుల వద్ద అవుటయ్యాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. క్లాసేన్ ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నాడు. హైదరాబాద్ బ్యాటర్లు దంచి కొడుతుండటంతో భారీ పరుగులు సాధించే దిశగా స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది.

భారీ స్కోరు దిశగా...
ఓవర్ రన్ రేట్ 14 కు పైగానే ఉంది. 20 ఓవర్లకు 286 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. గతంలో నూ ఇదే ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్హైదరాబాద్ జట్టు 280 పరుగులు చేసి ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు నమోదు చేసింది. ఈ రికార్డును అధిగమించాలన్న తపన సన్ రైజర్స్ లో కనిపిస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ను అలవోకగా కొడుతుండటంతో రికార్డులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని పిస్తుంది. ఇంకా రెండు ఓవవరలు మిగిలి ఉండటం చేతిలో వికెట్లు ఉండటంతో భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచే అవకాశం ఉంది. చివర్లో షాట్లు కొట్టి వరసగా అవుటయినా 20 ఓవర్లకు 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 287 గా ఉంది.


Tags:    

Similar News