IPL 2025 : ఆదివారం దక్షాదిన దంచి కొట్టారుగా... ఫ్యాన్స్ కు పండగ
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అలవోకగా రాజస్థాన్ రాయల్స్ జట్టు మీద గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించింది;

నిన్న సౌత్ ఇండియాలో జరిగిన రెండు మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించాయి. హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అలవోకగా రాజస్థాన్ రాయల్స్ జట్టు మీద గెలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ కూడా తక్కువ తినలేదు. కాసేపు సన్ రైజర్స్ ను కంగారు పెట్టారు.ఆదివారం ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 286 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ నమోదు చేయగా, ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేశాడు. చివరకు క్లాసెన్ తన బ్యాట్ తో కేవలం పథ్నాలుగు బంతుల్లోనే 34 పరుగుల చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ లో తుషార్ పాండే 3, తీక్షణ రెండు వికెట్లు తీశారు. 286 అతి భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ముందుంచింది.
పోరాడి ఓడినా...
అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా గట్టిగానే బదులిచ్చిందని చెప్పాలి. స్కోరును చూసి ఏమాత్రం బెంబేలెత్తకుండా వికెట్లుపడిపోయినా సంజూ శాంసన్, థువ్ర్ జురెల్ నిలబడి ఒక దశలో సన్ రైజర్స్ కు చెమటలు పట్టించారు. సంజూ శాంసన్ 66, ధ్రువ్ జురెల్ 70, హెట్ మేయర్ 42 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపినా ఫలితం లేకుండా పోయింది. సన్ రైజర్స్ లై సిమర్ జిత్ రెండు, హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో రాయల్స్ ను దెబ్బతీశారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ పరుగులు, తక్కువ బంతులు ఉండటంతో కేవలం నలభై నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఏ మాత్రం స్కోరు ను చూసి బెంబేలెత్తకుండా పరుగులను ఛేదించడానికి ప్రయత్నించి చివరకు విఫలమయింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు.
చెన్నై విజయం...
ఇక చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా అలరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ కేవలం 156 పరుగులు సాధించింది. అయితే తక్కువ స్కోరు కావడంతో పాటు చెన్నై లక్ష్యాన్ని చేరుకునే సమయంలో ఒక వికెట్ కోల్పోయి 78 పరుగులు చేయడంతో ఇక విజయం సులువని అందరూ అనుకున్నప్పటికీ ముంబయి బౌలర్లు టపా టపా వికెట్లు తీయడంతో వత్తిడిని చెన్నై సూపర్ కింగ్స్ ఎదురుర్కొన్నారు. రచిన్ రవీంద్ర 65 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం మీద నాలుగు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ గా నాలుగు వికెట్లు తీసిన నూర్ అహ్మద్ ఎంపికయ్యాడు. మొత్తం సండే రోజున సౌత్ ఇండియాలో జరిగిన రెండు మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించాయని చెప్పాలి.