ఆ క్రికెటర్ మతమార్పిడికి ప్రయత్నించిన అఫ్రీది

అఫ్రిదిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇస్లాంలోకి మారాలని అఫ్రిదీ తనపై

Update: 2023-10-27 12:50 GMT

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇస్లాంలోకి మారాలని అఫ్రిదీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆరోపించాడు. అయితే తనకు ఇంజమామ్ ఉల్ హక్ మద్దతు ఇచ్చాడని కనేరియా చెప్పుకొచ్చాడు. ఇంజమామ్-ఉల్-హక్ రిటైర్మెంట్ తర్వాత జట్టులో కొనసాగడం తనకు చాలా కష్టంగా మారిందని కనేరియా తెలిపాడు. గొప్ప స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న కనేరియా ఎక్కువ రోజులు పాకిస్థాన్ జట్టులో కొనసాగలేకపోయాడు. అదే తాను ఇస్లాం ను స్వీకరించి ఉండి ఉంటే ఆ సమయంలో తనను తప్పకుండా పాకిస్థాన్ జట్టు కెప్టెన్ గా చేసి ఉండేవారని కనేరియా ఆరోపణలు గుప్పించాడు.

అంతకు ముందు షాహిద్ అఫ్రీదీ తన ఇంటర్వ్యూ సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా కనేరియా షేర్ చేశాడు. అఫ్రిది తన కుమార్తె పూజ చేస్తున్నట్లు నటించడం చూసి టీవీ పగలగొట్టినట్లు చెప్పిన వీడియో అది. తన కూతురు పూజ చేస్తున్నందుకే షాహిద్ అఫ్రిది టీవీని పగలగొట్టాడు.. అది కూడా తన అమాయక కూతురితో ఇలా ప్రవర్తిస్తే.. ఇక నాతో ఎలా ప్రవర్తించి ఉండి ఉంటాడో మీరే ఊహించుకోండని కనేరియా తెలిపాడు. పాకిస్థాన్‌లో తనను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడానికి చేసిన ప్రయత్నాల గురించి డానిష్ కనేరియా చెప్పడం ఇదే మొదటిసారి కాదు. ఇస్లాంను స్వీకరించాలంటూ కనేరియాను మైదానంలోనూ, వెలుపల కూడా అతడిపై ఒత్తిడి తెచ్చారు. కనేరియా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత పౌరసత్వం స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News