జనసేనకు 8 సీట్లు

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు ఖరారయింది. జనసేనకు ఎనిమిది సీట్లను కేటాయిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది;

Update: 2023-11-05 02:51 GMT
janasena, bjp, alliance, telangana, elections, eight seats
  • whatsapp icon

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు ఖరారయింది. జనసేనకు ఎనిమిది సీట్లను కేటాయిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపిన అనంతరం సీట్లను బీజేపీ జనసేనకు కేటయిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిసింది.

సీట్లివే...
జనసేనకు ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట్, తాండూర్, కోదాడ, నాగర్ కర్నూల్, కూకట్ పల్లి స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా నిన్ననే పవన్ కల్యాణ్ తమకు 32 సీట్లను కావాలని కోరినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎనిమిది సీట్లు ఖారరు చేసిందని తెలిసింది.


Tags:    

Similar News