సిద్ధిపేట ఘటనపై హరీశ్‌రావు ట్వీట్
సిద్ధిపేటలోని తన ఎమ్మెల్యే నివాసంపై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు.
సిద్ధిపేటలోని తన ఎమ్మెల్యే నివాసంపై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్ గూండాలు ఈ దాడి చేశారన్నారు. పోలీసులు కూడా చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే...
ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్ధిపేట ఘటనను డీజీపీ సీరియస్ గా తీసుకుని ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. తాళాలు పగలకొట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు.