KTR : కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్

బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉండేకన్నా ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్ అన్నారు;

Update: 2024-01-09 12:11 GMT
ktr, kotha prabhakar reddy, congress, telangana elections
  • whatsapp icon

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉండేకన్నా ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్ అని ఆయన అన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీని ఒక ఆటాడుకుంటారని కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నెల నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ఆచితూచి తాము స్పందిస్తామని అన్న ఆయన అందుకు వంద రోజులు సమయం ఉందని, ఇప్పటికే ముప్పయి రోజులు గడిచిపోయాయని తెలిపారు.

త్వరలో కమిటీలు...
త్వరలో బీఆర్ఎస్ జిల్లా, రాష్ట్ర కమిటీలను కూడా వేస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ బ్రాండ్ ను ఈ ప్రభుత్వం చెడగొట్టేలా నిర్ణయం తీసుకుంటుందని, ప్రజలు కూడా త్వరగానే అర్థం చేసుకుంటున్నారన్నారు.


Tags:    

Similar News