Telangana : నేడు మూసీ ప్రాజెక్టుపై రేవంత్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సమీక్షించనున్నారు.;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సమీక్షించనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనుల ప్రారంభించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించడం, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా కేటాయించారు.
ట్రిపుల్ ఆర్ పై కూడా...
మూసీ పునరుజ్జీవ పథకంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా స్థలంతో పాటు పరిహారం ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని ఇళ్లకు నోటీసులు కూడా అంటించారు. ఈరోజు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించి పురోగతిపై చర్చించనున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్డుపై కూడా సమీక్షలు నిర్వహిస్తారు.