Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దదారులకు గుడ్ న్యూస్...త్వరలోనే వారి ఖాతాలో లక్ష నగదు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లనువేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది;

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లనువేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. తొలి విడత నిధులను మంజూరు చేయడానికి నిధులను రెడీ చేస్తుంది. ఇందిరమ్మఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తుంది. ఒక్కొక్క ఇంటిని ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుకునే వీలుంది. తొలి విడతగా నియోజకవర్గానికి 3,750 మంది లబ్దిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారిని తొలి జాబితాలో చోటు కల్పించింది. అయితే వీలయినంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు.
ఇళ్ల నిర్మాణానికి...
ఇందిరమ్మ ఇళ్లను గృహ నిర్మాణ సంస్థ పర్యవేక్షణలో నిర్మించాల్సి ఉంది. అయితే ఈ సంస్థలో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో వీటి పరిశీలనకు కొంత ఇబ్బందిగా మారింది. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టు బేసిస్ లో ఇంజినీర్లను నియమించుకోవడానికి సిద్ధమయింది. నేటితో ఈ పనులు చేపట్టడానికి అర్హత కలిగిన ప్రయివేటు ఇంజినీర్లు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వీరికి నెలకు 33,800 రూపాయలు వేతనం మంజూరు చేస్తుంది. ఏడాది కాలం పాటు వీరి పనితీరును పరిశీలించిన తర్వాత కొనసాగించాలా? వద్దా? అన్నది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం వందల సంఖ్యలో అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టనుంది.
తొలి దశలో వీరందరికీ...
తొలి దశలో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావించిన ప్రభుత్వం 72 వేల మంది లబ్దిదారులకు అనుమతులను మంజూరు చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల ఇందులో దాదాపు పదివేలకు మందికిపైగనా పునాదితో పాటు బేస్ మెంట్ పనులు పూర్తి చేశారు. బేస్ మెంట్ ముగిసిన తర్వాత ప్రభుత్వం లక్ష రూపాయలను మంజూరు చేసింది. అయితే బేస్ మెంట్ పూర్తయిందని సర్టిఫికేట్ ఇవ్వాలంటే అసిస్టెంట్ ఇంజినీర్లు కావాల్సి ఉన్నందున వారి నియామకం కోసం వేగంగా నియామకపు ఉత్తర్వులు జారీ చేయనుంది. గత ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను రహదారుల భవనాల శాఖలో కలిపేసినందున ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వేగంగా 72 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.