Telangana : నేటి నుంచి సలేశ్వరం జాతర
నేడు నల్లమలలోని సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ జాతర జరగనుంది;

నేడు నల్లమలలోని సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. చెంచుల ఆరాధ్య దైవమైన సలేశ్వరం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. నల్లమల అటవీ ప్రాంతమైన లోయ గుహలో వెలిసిన లింగమయ్య దర్శనం కోసం భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు...
దీనిని తెలంగాణ అమర్ నాధ్ యాత్రగా భావిస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు ఈ జాతరకు రావద్దని అధికారులు సూచించారు.