ఒకే కారులో బావాబామ్మర్ధులు.. కేటీఆర్, హరీష్‌రావు ఫోటోలు వైరల్‌

మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుల ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి..శీతాకాల విడిదిలో;

Update: 2023-12-22 12:11 GMT
BRS MLAs Harish Rao, BRS MLA KTR, Traveling, Telangana, Social Media, political news, telangana news

BRS MLAs

  • whatsapp icon

మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుల ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం విధితమే. ఇందులో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎట్ హోం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగనుంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని శీతాకాల విడిది భవన ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి అధికార పార్టీతోపాటు.. విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ఆహ్వానం అందింది.

దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలు.. బావాబామ్మర్దులు.. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ బొల్లారం బయలు దేరారు. తెలంగాణ భవన్ నుంచి ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా.. హరీష్ రావు ఆయన పక్కన కూర్చొని కనిపించారు. ఈ ఫొటోలను హరీశ్‌ రావు తన ఎక్స్ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఇవి వైరల్‌ అవుతున్నాయి.



Tags:    

Similar News