Hyderabad : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం అస్సలు ఏంటి?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పక్కనే ఉన్న భూముల జోలికి పోవడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.;

Update: 2025-04-01 11:58 GMT
hyderabad central university, land, dispute, telangana
  • whatsapp icon

సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే.. ప్రభుత్వానికి భూముల వేలం వేయక తప్పని పరిస్థితి. ఎప్పటి నుంచో ఈతతంగం జరుగుతుంది. ఇది కొత్తేమీ దకాదు. కాకుంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని విద్యార్థులు ఆందోళనకు దిగడం, దీనికి రాజకీయ రంగు పులుము కోవడంతో ఒకింత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ హెచ్.ఎం.డీ.ఏ పరిధిలోని భూములను విక్రయించడంో పాటు వేలం వేయడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వినిపిస్తుంది. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హఆమీలను అమలు చేయాలంటే అవసరమైన నిధులు అవసరం.

కేంద్రం నుంచి నిధులు అందక....
ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి అంత సహకారం అందదన్నది అందరికీ తెలిసిందే. ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవు. ఇక ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా ప్రజలపై పన్నుల భారాన్ని పెంచాలన్నా అది ప్రభుత్వానకి చెడ్డపేరు తెస్తుందన్న భావన కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఇటు ప్రజలపై ఛార్జీల భారం మోయలేక, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక పోవడంతో హామీలను అమలు చేయాలన్నా ప్రభుత్వానికి భూముల వేలం తప్పని సరి. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పక్కనే ఉన్న భూముల జోలికి పోవడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
రాజకీయంగా మలుపు...
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారంతా హెచ్.సి.యూకి చెందిన భూములను ఎలా విక్రయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందని భూములు కావని, గతంలోనే ప్రభుత్వానికి ఈ భూముల బదలాయింపు జరిగిందని, న్యాయస్థానాల్లో కూడా కేసులు నడిచాయని ప్రభుత్వ గుర్తు చేస్తుంది. గత రెండు రెండో రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో జేసీబీలు చదును చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తోడయ్యారు. దీంతో ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారి చికాకును కల్గిస్తుంది.
సీఎం రివ్యూ...
అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులుతో సమావేశమయై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై ఆయన సమీక్ష జరిపారు. ప్రజా సంఘాలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా సమావేశమై వారికి ఈ భూముల బ్యాక్ గ్రౌండ్ ను వివరించే ప్రయత్నం చేశారు. ఇవి ప్రభుత్వానికి చెందిన భూములు కావడంతోనే తాము వేలం వేయడానికి నిర్ణయించామని, కంచె గచ్చిబౌలిలో గతంలో ఈ స్థలం ప్రభుత్వానికి హెచ్.సి.యూ స్వాధీనం చేయడంతో దానికి ప్రత్యామ్నాయంగా భూమిని కూడా కేటాయించినట్లు గుర్తు చేశారు. మొత్తం మీద ఆదాయం పెంచుకోవాలన్న కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నానికి రాజకీయ పార్టీలు గట్టిగానే అడ్డుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News