అవినాష్ సీబీఐ విచారణ వాయిదా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ ఉంటుందని సీబీఐ నోటీసులు ఇవ్వడతో ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈరోజు విచారణ చేయడం లేదని సీబీఐ అధికారులు తెలిపారు
రేపు రమ్మంటూ...
వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రమ్మని సీబీఐ అధికారులు తెలిపారు. వాట్సప్ ద్వారా అవినాష్ కు నోటీసులు పంపారు. సీఆర్‌పీసీ 160 కింద అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీబీఐ నోటీసులు అందడంతో దారిలోనే అవినాష్ రెడ్డి వెనక్కు వెళ్లిపోయారు