Weather Report : ఏప్రిల్ నాలుగు నుంచి ఎండలు మామూలుగా ఉండవట
రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది;

రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. భూమి ఉపరితలం వేడెక్కడంతోపాటు ద్రోణి ప్రభావంవల్ల తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు నుంచి రెండు రోజుల పాటు ఉత్తర, పశ్చిమ గెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు వడగండ్ల వాన వాన కూడా పడుతుందని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.
మరికొన్ని చోట్ల పొడి వాతావరణం...
అయితే మరికొన్ని చోట్ల మాత్రం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షం కురుస్తుందని, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈదురుగాలులు కూడా ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వాతావరణం కొన్ని ప్రాంతాల్లో కూల్ గా ఉంటుందని తెలిపింది. నిన్న మొన్నటి వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయిన ప్రజలకు ఎండల నుంచి కాస్తంత ఉపశమనం లభించనుంది.
4వ తేదీ నుంచి...
మరోవైపు ఎండల తీవ్రత ఈ నెల 4వ తేదీ నుంచి మరింత పెరిగే అవకాశముందని కూడా తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే నలభై ఐదు డిగ్రీల వరకూ నమోదవుతాయని పేర్కంది. అందుకే ఈ నెల 4వ తేదీ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెప్పింది. ప్రజలు వీలయినంత వరకూ ఈ నెల 4వ తేదీ నుంచి ఇళ్లలోనే గడపటం మంచిదని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వంటివి ఉంటాయని, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులు బయటకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.